Header Banner

తిరువూరు ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా..! ఎందుకంటే..?

  Mon May 19, 2025 15:31        Politics

తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక (Tiruvuru Nagara Panchayat Chairman Election) వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను అధికారులు రేపటికి (మంగళవారం) వాయిదా వేశారు. ఎన్నికకు కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. నగర పంచాయతీలో మొత్తం కౌన్సిల్ సభ్యులు 20 మంది ఉన్నారు. వారిలో కేవలం ఏడుగురు మాత్రమే ఎన్నికకు వచ్చారు. మిగిలిన వారు ఎవరూ కూడా హాజరుకాకపోవడంతో ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చిందని ఎన్నికల అధికారి చెప్పారు.

కాగా.. తిరువూరు నగర పంచాయతీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీకి చెందిన సభ్యులతో పాటు వారి అనుచరులు కూడా ఎన్నిక జరిగే ప్రాంగణానికి రావడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలను, అనుచరులను ఎన్నికల ప్రాంగణం నుంచి చెదరగొట్టి ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చారు పోలీసులు. ఎన్నిక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఉదయమే ఎన్నిక ప్రాంగణానికి చేరుకోవడంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి కౌన్సిల్ హాల్‌లోకి వెళ్లేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి చెదరగొట్టారు.

మొత్తం 20 మందిలో 17 మంది వైసీపీ సభ్యులు, ముగ్గురు టీడీపీ సభ్యులు, ఎక్సఫీషోయో సభ్యులుగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉన్నారు. అయితే పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దుతు ఇస్తే తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ పదవి టీడీపీకి దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ పార్టీ కండువా కప్పుకోగా.. మరో ఐదుగురు టీడీపీకి మద్దతుగా నిలిచారు. అయితే ఎలాగైనా ఛైర్మన్‌ పోస్టును దక్కించుకునేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈరోజు కోరం లేక ఎన్నిక వాయిదా పడగా.. రేపటి ఎన్నికల్లో ఛైర్మన్ పదవిని ఎవరు దక్కించుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TiruvuruPolitics #ChairmanElection #ElectionPostponed #APPolitics #BreakingNews #PoliticalTwist